మిడిల్ ఫింగర్ చూపిస్తున్న సమంత..!

-

హీరోయిన్ గా సమంత సూపర్ టాలెంట్ చాటేయగా అక్కినేని కోడలిగా మారాక కొత్త టర్న్ తీసుకుంది. సినిమాల సెలక్షన్స్ విషయంలో కాస్త ఆచి తూచి అడుగులేస్తున్న సమంత ట్రోలింగ్స్ కు ఈసారి గట్టిగా సమాధానం చెప్పింది అలాంటిలాంటి సమాధానం కాదు ఏకంగా మిడిల్ ఫింగర్ చూపించేసింది. ఎప్పుడు ఫ్యాన్స్ తో సరదాగా ఉండే సమంత ఇలా ఎందుకు చేసింది అంటే అక్కినేని కోడలిగా మారాక సమంత కొన్నిటిలో మారినట్టు కనిపించినా కొన్నిటిలో మారడం లేదని ఫ్యాన్స్ ఆందోళన.

ప్రస్తుతం స్పెయిన్ లో నాగ చైతన్యతో హాలీడే ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న సమంత ఆ క్రమంలోనే ఓ స్టిల్ ఇచ్చింది. దాన్ని తన ఇన్ స్టాగ్రాంలో పెట్టింది. ఎప్పటిలానే తన హాట్ లుక్స్ తో ఆకట్టుకునేలా పిక్ ఉన్న అక్కినేని కోడలిగా సమంత చేసిన పనికి కొందరి ఫ్యాన్స్ కు నచ్చలేదు. అందుకే ఆమె మీద నెగటివ్ ట్రోల్స్ చేస్తున్నారు.

అయితే ఆ ట్రోల్స్ అన్నిటికి సమాధానంగా ఓ పోస్ట్ పెట్టింది. మిడిల్ ఫింగర్ చూపిస్తూ తన జీవితంలో తనకు ఎప్పుడు ఏం చేయాలో తెలుసని మందలించింది. పెళ్లి తర్వాత ఏం చేయాలి ఏం చేయొద్దో అది నా ఇష్టం.. దాని గురించి మాట్లాడే హక్కు మీకు ఎక్కడిది అంటూ ఓ కొటేషన్ పెట్టింది. మొత్తానికి సమంత ఇచ్చిన ఘాటు రిప్లైకి అందరు అవాక్కయ్యారని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news