తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అదిరిపోయే శుభవార్త అందింది. తెలంగాణలో అందుబాటులోకి ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులు..వచ్చేశాయి. ఇక ఈ మేరకు మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ నేడు కరీంనగర్ లో ప్రారంభించనున్నారు. ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించే సదుపాయాలు ఈ ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులల్లో కల్పించారు.
41 సీటింగ్ సామర్థ్యమున్న 35 ఎలక్ట్రిక్ బస్సులను మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ నేడు కరీంనగర్ లో ప్రారంభించనున్నారు. ఈ ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 325 కిలో మీటర్లు ప్రయాణిస్తాయి. 2-3గంటల్లో వంద శాతం పూర్తి ఛార్జింగ్ ఎక్కుతాయి.