గత అసెంబ్లీ సందర్భంగా ఎన్టీయే కూటమి ప్రజలకు పలు హామీలు ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో ఇప్పటికే కొన్నింటిని అమలు చేయగా..మరికొన్నింటిని ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తోంది. తాజాగా ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పారు. ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందించే పథకాన్ని రాష్ట్రంలో అమలు ఎప్పుడు చేయనున్నారో ప్రకటించారు. దీపావళి పండుగ కానుకగా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందిస్తామని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి ఆదేశాలతో ఇప్పటికే అధికారులు ఆ మేరకు కసరత్తులు ప్రారంభించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.55 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. తెల్లరేషన్ కార్డు ఉన్న 1.47 కోట్ల మందికి ఏటా 3 సిలిండర్లను ఉచితంగా ఇస్తే రూ.3500 కోట్ల మేర ప్రభుత్వ ఖజానాపై భారం పడనుంది. ఈ విషయాన్ని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.అటు దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లను ఉజ్వల కిందకు కేంద్రం మారిస్తే రాష్ట్రంపై భారం కాస్త తగ్గనుంది.