ఎమ్మెల్యే పదవికి దానం నాగేందర్‌ రాజీనామా..కాంగ్రెస్‌ కీలక నిర్ణయం!

-

దానం నాగేందర్‌ విషయంలో కాంగ్రెస్‌ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. దానం నాగేందర్‌తో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించే యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు సమాచారం అందుతోంది. తెలంగాణ స్పీకర్ నిర్ణయం తీసుకునే వరకు వేచి ఉండక ముందే రాజీనామా చేయించి తిరిగి ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ ఆలోచనలో ఉంది.

Congress party is planning to resign from the post of MLA with Danam Nagender

2004లో ఇలానే రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లి ఓడిపోయారు దానం నాగేందర్. కానీ అందుకే రాజీనామాకు దానం నాగేందర్…సుముఖత చూపలేదు. ఇది ఇలా ఉండగా… దానం నాగేందర్‌, తెల్లం వెంకట్రావ్‌, కడియం శ్రీహరి పైన ఇటీవల హై కోర్టు సీరియస్‌ అయింది. నెల రోజుల్లోగా దానం నాగేందర్‌, తెల్లం వెంకట్రావ్‌, కడియం శ్రీహరి పైన ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కు ఆదేశాలు ఇచ్చింది కోర్టు.

Read more RELATED
Recommended to you

Latest news