భవిష్యత్తులో పరిస్థితులు చైనాకు కఠినంగా మారొచ్చు!

-

భవిష్యత్‌లో డ్రాగన్ కంట్రీ చైనా కఠిన పరిస్థితులను ఎదుర్కొనే అవకాశాలున్నాయని ఆ దేశ అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అన్నారు. చైనా 75వ జాతీయ దినోత్సవం సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన.. అమెరికాతో ఉన్న కాంపిటీషన్‌తో పాటు భారత్, ఇతర పొరుగు దేశాలతో ఉన్న ఉద్రిక్తతలు,ఆర్థికపరమైన ప్రతికూల పరిస్థితుల కారణంగా దేశం మున్ముందు కఠిన సవాల్స్ ఎదుర్కొవాల్సి ఉంటుందని సందేహం వ్యక్తం చేశారు.

‘మనం అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాం.రానున్న రోజుల్లో అడ్డంకులు, కఠిన పరిస్థితులు రావొచ్చు.ఇలాంటి సమయాల్లో అప్రమత్తంగా ఉండాలి.క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలి’ప్రజలనుద్దేశించి వ్యాక్యానించారు. ప్రస్తుతం ప్రజలకు ముందస్తు ప్రణాళికలు అవసరం అని సూచించారు. కమ్యూనిస్ట్ పార్టీ, సైన్యం, దేశంలోని ప్రజలు కలిసికట్టుగా ఉంటే ఎటువంటి అడ్డంకులనైనా ఎదుర్కోగలమన్నారు. తైవాన్‌తో ఉన్న వివాదం అంతర్గతమని, తైవాన్ స్వాతంత్య్రాన్ని వ్యతిరేకిస్తున్నట్లు జిన్‌పింగ్ తెలిపారు.కాగా, చైనా గత కొంతకాలంగా స్థిరాస్తి మార్కెట్ దెబ్బతినడం, ఈవీ వాహనాలు, బ్యాటరీలపై అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్ అధికంగా పన్నులు విధించడం, దేశ అంతర్గత సమస్యలతో సతమతం అవుతోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news