ఇజ్రాయెల్‌లోని ప్రవాస భారతీయులకు కేంద్రం అడ్వైజరీ జారీ

-

మిడిల్ ఈస్టులో యుద్దవాతావరణం నెలకొన్న తరుణంలో ఎప్పుడు ఏంజరుగుతుందోనని ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు నెలకొన్నాయి. హిజ్బుల్లా, హమాస్ మిలిటెంట్ సంస్థల అగ్రనేతలను చంపిన ఇజ్రాయెల్‌పై మంగళవారం రాత్రి ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది. దాదాపు 400కు పైగా క్షిపణులు ఇరాన్ భూతలం నుంచి ఇజ్రాయెల్ ప్రాదేశిక ప్రాంతంలో పడ్డాయి. ఇరాన్‌ దాడి గురించి అమెరికా ముందస్తుగానే హెచ్చరికలు చేసింది. ఇజ్రాయెల్ కూడా ఐరమ్ డోమ్ సాయంతో ఆ మిస్సైల్స్‌ను కూల్చిసింది.

ముందు ముందు ఈ ఘర్షణ వాతావరణం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో తెలియడం లేదు. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్‌లోని భారతీయులకు కేంద్రం అడ్వైజరీ జారీ చేసింది.ప్రవాసులు సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని ఇండియన్ ఎంబసీ సూచించింది. ఇజ్రాయెల్‌లోని ఇండియన్ ఎంబసీ అధికారులతో ప్రజలు టచ్‌లో ఉండాలని కేంద్రం కోరింది. యుద్ధ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని తెలిపింది. అక్కడి ప్రజల సహాయార్థం హెల్ప్‌లైన్ నంబర్‌ను కూడా ఏర్పాటు చేసింది.ఇజ్రాయెల్‌లో ప్రస్తుతం 32 వేల మంది భారతీయులు నివసిస్తున్నారని కేంద్రం తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news