సమంతకు కొండా సురేఖ క్షమాపణలు..!

-

టాలీవుడ్ హీరోయిన్ సమంతకు తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పారు.
సమంతపై తను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నా అంటూ కొండా సురేఖ..చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. కొండా సురేఖ..చేసిన వ్యాఖ్యలు.. కాంగ్రెస్ అనుకూల మీడియాలో వస్తున్నాయి.

konda surekha say sorry to samantha

నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ, మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లైతే బేషరతుగా నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాను అంటూ కొండా సురేఖ ప్రకటించారట. నా వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ మీ మనోభావాలను దెబ్బతీయడం కాదన్నారు. స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు నాకు కేవలం అభిమానం మాత్రమే కాదు.. ఆదర్శం కూడా.. అంటూ చెప్పారు తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ.

Read more RELATED
Recommended to you

Latest news