మరో కొద్ది గంటల్లో శబరిమలలో మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు!

-

శబరిమల ఆలయంలోకి ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు గల మహిళల ప్రవేశంపై మరి కొద్దిగంటల్లో సుప్రీం కోర్టు కీలక  తీర్పుని వెలువరించనుంది. మహిళల ప్రవేశాన్ని నిషేధించడాన్ని సవాలు చేస్తూ యంగ్‌ లాయర్స్‌ అసోసియేషన్‌, ఇతరులు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీంతో  ఆగస్టు 1 నుంచి 8 రోజులపాటు ఇరు వర్గాల వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం.. తీర్పును సెప్టెంబర్ 28 కి రిజర్వు చేసింది.

అయ్యప్ప ఆలయంలోని అమ్మాయిలను, మహిళలను అనుమతించకపోవడం  లింగసమానత్వానికి విరుద్ధమంటూ 2006లో మహిళా న్యాయవాదుల బృందం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.. ఈ విషయంపై ట్రావెన్ కోర్ దేవస్థానం, అయ్యప్ప దేవస్థానం ఆచారవ్యవహారాల ప్రకారం  అయ్యప్పస్వామి ‘బ్రహ్మచారి’ అని.. అందుకే 10 నుంచి 50 సంవత్సరాల వయస్సు గల అమ్మాయిలను,  మహిళలను ఆలయంలోకి అనుమతించడంలేదని దేవస్థానం అధికారులు గతంలో కోర్టుకి వివరించారు.  దీంతో విచారణ చేపట్టిన సుప్రీం  ఆలయంలోకి ప్రవేశించి, పూజలు చేసుకోవడం మహిళల రాజ్యాంగ హక్కు వారిని దర్శనానికి నిషేధించడం మహిళల హక్కులను కాలరాయడమే అవుతుందని వ్యాఖ్యానిస్తూ… రాజ్యంగంలోని ఆర్టికల్‌ 25, 26ల ప్రకారం పురుషులకు వర్తించేవన్నీ మహిళలకు కూడా వర్తిస్తాయని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news