దూకుడుగా జనాల్లోకి వెళ్లేందుకు కొత్త స్కెచ్ రెడీ చేసిన తెలంగాణ కాంగ్రెస్.. వర్కౌట్ అయితే తిరుగుండదు..

-

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా.. అనుకున్నంత మైలేజ్ రావడం లేదు.. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు, ఆరోపణలు మాత్రమే జనాల్లోకి వెళ్తున్నాయి.. సీనియర్ ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నా కూడా.. వారు ప్రతిదానికి స్పందించకపోవడం పార్టీని దెబ్బ తీస్తున్నాయి.. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ గౌడ్ కీలక నిర్ణయం తీసుకున్నారని పార్టీలో చర్చ నడుస్తుంది.. పీసీసీ ని ప్రక్షాళన చేసేందుకు సిద్ధమయ్యారట.. అధికార ప్రతినిధుల నియామకాల్లో సీనియర్లకు పెద్ద పీఠ వెయ్యాలని భావిస్తున్నారట..

ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రజలకు మంచి చేస్తున్నా.. అది జనాల్లోకి వెళ్లడం లేదనే భావన సీనియర్ నేతల్లో ఉంది.. ఇదే విషయం పలువురు పీసీసీ అధ్యక్షులు దృష్టికి తీసుకెళ్లినట్లు ప్రచారం జరుగుతుంది.. దింతో అయన కొన్ని విషయాలు మీద దృష్టి పెట్టారట.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యమా స్పీడు లో ఉన్న సోషల్ మీడియా.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సైలెంట్ అయిందని.. దాని వల్ల విపక్షాల వాయిస్ ఏ బలంగా వినిపిస్తుందని ఆయన గుర్తించారట.. దీంతో సోషల్ మీడియాని ఆక్టివేట్ చేసేందుకు.. సోషల్ మీడియా ప్రతినిధులు కార్యకర్తలతో అయన సమావేశం అవ్వబోతున్నారనే టాక్ వినిపిస్తుంది..

సోషల్ మీడియాను మరింత బలోపేతం చేసేందుకు ఆయన కసరత్తు చేస్తున్నారని.. దాంతోపాటు పీసీసీ ప్రక్షాళన దిశగా కూడా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.. పార్టీలో సీనియర్ గా ఉన్న ఎమ్మెల్యేలకు అధికారం ప్రతినిధి బాధ్యతలు అప్పగించాలని ఆయన ఆలోచిస్తున్నారట.. రాష్ట్రంలో ఉండే సమస్యలపై, వాగ్దాటి కలిగిన ఎమ్మెల్యేలు అయితే పార్టీ వాయిస్ ని బలంగా వినిపించ గలుగుతారని పిసిసి అధ్యక్షులు భావిస్తున్నారని ఇందిరా భవన్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడంతో పాటు… సీనియర్ ఎమ్మెల్యేలకు కీలక బాధ్యతలిస్తే.. పార్టీ వాయిస్ బలంగా వెళ్తుందని తద్వారా పార్టీకి మైలేజ్ వస్తుందని పిసిసి అధ్యక్షులు ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.. ఆయన ఆలోచనలు ఎంత మేరకు వర్కౌట్ అవుతాయో భవిష్యత్తులో చూడాలి మరి..

Read more RELATED
Recommended to you

Latest news