రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి క్లియరెన్స్ ఇవ్వాలి : బాల్క సుమన్

-

రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలకు వెంటనే ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇవ్వాలని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ డిమాండ్ చేసారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ..  పది నెలల కాంగ్రెస్ పాలనలో ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదన్నారు. ఈవెంట్ మేనేజ్ మెంట్ లాగా తాము ఇచ్చిన నోటిఫికేషన్లకు సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు ఇస్తున్నారని ఆరోపించారు.

ఎన్నికల ముందు ప్రియాంకగాంధీ నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన విషయాన్ని ప్రజలు మరిచిపోలేదన్నారు. ప్రతీ ఏడాది ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామని కాంగ్రెస్ చెప్పిందని ఆరోపించారు. 18 ఏళ్లు నిండిన ప్రతీ ఆడపిల్లకు ఎలక్ట్రికల్ స్కూటీలు, మహిళలకు రూ.2500 ఇస్తామన్న హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. నిరుద్యోగుల ఓట్ల కోసం జాబ్ క్యాలెండర్ అంటూ యువతను నమ్మించి మోసం చేశారని పేర్కొన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న తాము 1.60 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు. రైతులకు రుణమాఫీ అయిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి అబద్దాలు చెబుతున్నాడని పేర్కొన్నారు బాల్క సుమన్. 

Read more RELATED
Recommended to you

Latest news