ఇండియాలో ఇన్‌స్టాగ్రామ్ డౌన్.. నెట్టింట యూజర్ల ఫిర్యాదులు!

-

దేశవ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్ సేవలు ఒక్కసారిగా నిలిచిపోయాయి. దీంతో యూజర్లు సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదులు చేస్తున్నారు. త్వరగా సేవలను పునరుద్ధరించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్ సేవల్లో అంతరాయం నెలకొనడంతో యూజర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ అకౌంట్లు ఏమైనా హ్యాక్ అయ్యాయా? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కొందరు యూజర్లు ఏకంగా యాప్‌ను అన్ ఇన్‌స్టాల్ చేసి..రీ ఇన్‌స్టాల్ చేయడం లాంటివి చేసినా లాభం లేకుండా పోయింది. ఇన్ స్టాగ్రామ్ సేవలు అకస్మాత్తుగా నిలిచిపోవడంతో మెటా సంస్థపై నెటిజన్లు సీరియస్ అవుతున్నారు. తాము ఎదుర్కొంటున్న అంతరాయంపై మెటా సంస్థ వెంటనే స్పందించాలని ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో రిక్వెస్ట్‌లు పెడుతున్నారు.సాంకేతిక సమస్యలే ప్రధాన కారణం అయ్యి ఉండొచ్చని యూజర్లు భావిస్తున్నారు.కాగా, ఇన్‌స్టాగ్రామ్ సేవలు నిలిచిపోవడంపై మెటా సంస్థ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news