హర్యానాలో బీజేపీ లీడ్ లోకి రావడం ఆశ్యర్యం.. శశిథరూర్ సంచలన కామెంట్స్..!

-

హర్యానా, జమ్ముకశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రదానంగా  హర్యానాలో అనూహ్యంగా బీజేపీ  అధికారం కైవసం చేసుకునే దిశగా పరుగులు తీస్తోంది.  ఉదయం నుంచి లీడ్ లో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులు ఒక్కసారిగా డీలా పడ్డారు. మొత్తం 90 స్థానాలకు గాను 50 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. 36  స్థానాల్లో కాంగ్రెస్, ఇతరులు  5 స్థానాల్లో ఆధిక్యతను కనబరుస్తున్నారు.

తాజాగా హర్యానా  ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ సీనియర్ ఎంపీ శశి థరూర్  సంచలన వ్యాఖ్యలు చేశారు. అనూహ్యంగా బీజేపీ అభ్యర్థులు ఆధిక్యాన్ని కనబరుస్తుండటం తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని అన్నారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎవరూ ఎలాంటి నిర్ణయానికి రావడం సరికాదన్నారు. హర్యానా ట్రెండ్స్.. ఎగ్జిట్ పోల్స్  వ్యవస్థ సిగ్గుపడేలా ఫలితాలు ఉన్నాయంటూ కామెంట్ చేశారు. అక్కడ ప్రజల్లో ప్రభుత్వంపై  వ్యతిరేకత తీవ్రంగా ఉందని అన్నారు. ఎన్నికల ముందుకు హర్యానాలో తమదే అధికారం అనే ధీమాతో ఉన్నామని పేర్కొన్నారు. కానీ, అనూహ్యంగా ఫలితాలు తారుమారు అవ్వడం అస్సలు ఊహించలేని విషయమని శశి థరూర్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news