కేంద్రం నుంచి కొత్త స్కీమ్.. మహిళల కోసం ఉచితంగా వాషింగ్ మిషన్లు..?

-

కేంద్ర ప్రభుత్వం అనేక రకాల స్కీములని అందిస్తోంది. కేంద్రం అందిస్తున్న స్కీముల వలన చాలామందికి ఉపయోగకరంగా ఉంటుంది. చాలామంది కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న స్కీములలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. మహిళల కోసం కూడా మోడీ సర్కార్ అనేక స్కీములను తీసుకువచ్చింది. అయితే ఉచితంగా వాషింగ్ మిషన్ అందించే స్కీముని కేంద్రం తీసుకువచ్చిందని తెగ ప్రచారం జరుగుతోంది. నిజంగా మోడీ సర్కార్ మహిళల కోసం ఈ సరికొత్త స్కీమ్ ని తీసుకువచ్చిందా ఇందులో నిజం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సోషల్ మీడియాలో ఫేక్ సమాచారాన్ని ప్రచారం చేసే వాళ్ల గురించి కొత్తగా చెప్పక్కర్లేదు.

తరచు మనకి సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. ప్రజలను మభ్య పెట్టే సందేశాలతో ఫేక్ సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ వ్యూస్ రాబడుతున్నారు. సోషల్ మీడియాలో ఇలాంటి ఒక ఫేక్ సమాచారం తెగ షికార్లు కొడుతోంది. మోడీ సర్కార్ త్వరలో మహిళలకు ఉచిత వాషింగ్ మిషన్ పథకాన్ని ప్రవేశపెట్టబోతోందని.. ఓ వీడియోని విడుదల చేశారు. దీంతో ఇది వెంటనే వైరల్ అయిపోయింది.

దీనిపై అనేక విధాలుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇది కాస్తా ప్రభుత్వం దృష్టికి కూడా వచ్చింది. కేంద్ర ప్రచార మంత్రత్వ శాఖ పీఐబీ ఫ్యాక్ట్ చెక్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా దీని గురించి క్లారిటీ ఇచ్చింది. ఉచిత వాషింగ్ మిషన్ స్కీమ్ అనేది నకిలీ ప్రచారం అని కొట్టిపారేసింది. ఇటువంటి పథకాన్ని కేంద్రం తీసుకురాలేదని చెప్పింది. ఫేక్ సంక్షేమ కార్యక్రమాల గురించి సోషల్ మీడియాలో పలు ప్రచారాలు జరుగుతున్నాయని.. జాగ్రత్తగా ఉండాలని సూచించింది అనవసరంగా ఇలాంటి నకిలీ వార్తలని నమ్మి మోసపోవద్దు లేకపోతే ఇబ్బంది పడాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news