రెడ్ బుక్ పెట్టడం పెద్ద పనికాదు.. మనం గుడ్ బుక్ పెడదాం – జగన్

-

రెడ్ బుక్ పెట్టడం పెద్ద పనికాదు.. మనం గుడ్ బుక్ పెడదామన్నారు వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు జగన్‌. గ్రామ/ వార్డు స్థాయిలో ఉన్న వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు, సానుభూతిపరులను ఏకతాటిపైకి తీసుకురండని కోరారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా.. మనం ఢీ అంటే ఢీ అనేలా ఉండాలని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలుంటాయి.. కానీ ఆ కష్టాల్లో నుంచే నాయకులు పుడతారని వివరించారు వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు జగన్‌.

YCP President Jagan’s sensational comments on the Red Book

మంగళగిరి నేతలతో జగన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ..మంగళగిరి నియోజకవర్గంలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలకు పూర్తి భరోసా ఇవ్వాలని భావించామని తెలిపారు. అధికార దుర్వినియోగంతో కార్యకర్తలకు నష్టంచేస్తున్నప్పుడు కచ్చితంగా భరోసా ఇవ్వాలని వెల్లడించారు. పార్టీ తోడుగా ఉంటుందనే విశ్వాసం కల్పించాలని… ఆ ఉద్దేశంతోనే ఈసమావేశం ఏర్పాటు చేశాం, పార్టీ పరంగా కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నామని పేర్కొన్నారు. అన్నిటికీ తట్టుకుని పార్టీ కార్యకర్తలకు అండగా ఉండే వ్యక్తి ఉండాలని భావించి వేమారెడ్డిగారిని ఇన్‌ఛార్జిగా నియమించామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news