పేద విద్యార్థులకు ప్రభుత్వం కార్పొరేట్ స్థాయి విద్యనందించడమే లక్ష్యం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

-

పేద విద్యార్థులకు ప్రభుత్వం కార్పొరేట్ స్థాయి విద్యనందించడమే లక్ష్యమని తెలిపారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తాజాగా మధిర నియోజకవర్గంలోని లక్ష్మీపురంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 25 ఎకరాల విస్తీర్ణంలో స్కూల్ మైదానం ఉంటుందని తెలిపారు. పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యనందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. అంతర్జాతీయ స్కూల్స్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు భట్టి విక్రమార్క. ప్రత్యేకంగా స్పోర్ట్స్ గ్రౌండ్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.

 

విద్యకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో.. వైద్యానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఆషామాషీగా నిధులు ఖర్చు చేయడం కాదు.. అన్ని వర్గాల వారిని న్యాయమైన విద్యనందించడమే లక్ష్యం అన్నారు. విద్య, వైద్యానికి బడ్జెట్ లో అధిక ప్రాధాన్యత కల్పించామని తెలిపారు. ప్రజల కోసం అంకితమై పని చేస్తున్నామని తెలిపారు. సంకల్పం ఉంటే.. చేసే పని మంచిది అయితే సాధ్యం కానిది అంటూ ఏది లేదని చేసి చూపిస్తున్నాం. రూ.5వేల కోట్లు ఈ ఏడాది ఇంటిగ్రేటేడ్ స్కూల్స్ కోసం ఖర్చు చేయనున్నామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news