హర్యానాలో కాంగ్రెస్ ఓటమికి నేనేనా కారణం?.. ఎంఐఎం చీఫ్ అసద్

-

హర్యానా ఎన్నికల ఫలితాలపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తాజాగా స్పందించారు. ‘హర్యానా ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఎలా గెలిచింది. నేను అక్కడ లేను.. లేకుంటే తనను ఆ పార్టీకి బీ-టీమ్ అని చెప్పేవారు. అక్కడ కాంగ్రెస్ వాళ్లు ఓడిపోయారు. ఇప్పుడు చెప్పండి, ఎవరి వల్ల ఓడిపోయారు?’ అని ప్రశ్నించారు. ‘నేను పాత పార్టీ (కాంగ్రెస్)కు చెప్పాలనుకుంటున్నాను. నేను చెప్పేది అర్థం చేసుకోండి.

మోడీని ఓడించాలంటే మీరు అందరినీ వెంట తీసుకెళ్లాలి. మీరు ఒంటరిగా ఏమీ చేయలేరు’ అని ఇండియా కూటమిని ఉద్దేశించి అసద్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. కాగా, కాంగ్రెస్ పార్టీ నిర్ణయాల వలన ఇండియా కూటమికి బీటలు వారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల హర్యానా ఫలితాల అనంతరం వచ్చే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఒంటరిగా వెళ్లేందుకు సిద్దమైందని మాజీ సీఎం కేజ్రీవాల్ ప్రకటించిన విషయం తెలిసిందే

Read more RELATED
Recommended to you

Latest news