దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ల కోసం ఎన్నో సేవలు అందిస్తోంది. కస్టమర్లకు అందించే ఈ సేవలు చాలామందికి బెనిఫిట్ ని ఇస్తున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్కీములను కూడా తీసుకువస్తూ ఉంటుంది. ఈ స్కీములు కూడా ఎంతో మందికి ఉపయోగకరంగా ఉంటాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిక్స్డ్ డిపాజిట్ చేసే వాళ్ళకి గుడ్ న్యూస్ చెప్పింది ఈ బ్యాంకులో ఫేమస్ అయిన అమృత్ కలష్ డిపాజిట్ స్కీమ్ గడువుని మళ్ళీ పెంచింది. సెప్టెంబర్ చివరితో ఈ స్కీం ముగిసిపోవాలి. మరో ఆరు నెలలు పొడిగించడం వలన 2025 మార్చి 31 వరకు ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది.
ఈ స్కీంకి సంబంధించి ఎలాంటి లాభాలు పొందొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం.. స్కీము మెచ్యూరిటీ కాలం వచ్చేసి 400 రోజులు. మామూలు ఫిక్స్డ్ డిపాజిట్ తో పోలిస్తే ఇందులో ఎక్కువ వడ్డీ వస్తుంది. జనరల్ కస్టమర్ కి 7.1 0% వడ్డీ వస్తుంది సీనియర్ సిటిజన్లకు 50 బేసిస్ పాయింట్లు పెంచి 7.60 శాతం వడ్డీ ఇస్తుంది. మాక్సిమం మూడు కోట్ల వరకు ఫిక్స్ డిపాజిట్ ని చేయొచ్చు.
గడువు పెంచడం వలన ఈ స్కీం డిపాజిట్ రెన్యూవల్ ని పెంచుకోవచ్చు. లక్ష రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ ఇస్తే 7.1.0% వడ్డీతో ఏడాదికి 7100 వడ్డీ వస్తుంది. సీనియర్ సిటిజెన్స్ కి 7,600 వస్తాయి. 10 లక్షలు చేస్తే నెలకు 5916 చొప్పున సంవత్సరానికి 71,000 వడ్డీ వస్తుంది సీనియర్ సిటిజెన్స్ కి 76000 వడ్డీ వస్తుంది. 400 రోజుల కాల పరిమితికి గమనించినట్లయితే కస్టమర్లకు వడ్డీ 77,750 వస్తుంది. సీనియర్ సిటిజెన్లకు 83,240 వస్తాయి.