ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ పర్యటన..

-

దసరా పండుగ నేపథ్యంలో శనివారం కొండారెడ్డి పల్లికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ముగిసింది. పండుగ వేడుకల కోసం తన సొంత గ్రామం నాగర్‌కర్నూల్ జిల్లాలోని కొండారెడ్డిపల్లికి వెళ్లిన సీఎం రేవంత్.. అక్కడ ప్రత్యేకపూజలు జరిపిన అనంతరం అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఆ తర్వాత ఆదివారం ఉదయం తన సొంత నియోజకవర్గం కొడంగల్‌కు చేరుకున్నారు.

అక్కడ తన సన్నిహితులతో కలిసి దసరా సంబురాల్లో పాల్గొన్నారు. వేడుకలు పూర్తయిన అనంతరం మధ్యాహ్న భోజనం చేసి తిరిగి హైదరాబద్‌కు బయలుదేరనున్నారు. నగరానికి చేరుకున్న వెంటనే మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో నిర్వహించే అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొననున్నారు.ఇదిలాఉంటే ప్రతి దసరాకి సొంతగ్రామం కొండారెడ్డిపల్లికి వెళ్లడం..ఆ మరుసటి రోజు కొడంగల్‌కు వెళ్లి రావడం రేవంత్ రెడ్డి ఆనవాయితీగా పెట్టుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news