వైసీపీ అధినేత గుడ్ బుక్ కాన్సెప్ట్ అదేనా..? టీడీపీలో స్టాటైన చర్చలు..

-

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల నుంచి ఏపీలో రెడ్ బుక్ టాక్ విపరీతంగా వినిపించింది.. నారాలోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు.. తమ కార్యకర్తలను చంపేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు.. అదే స్థాయిలో టీడీపీ కూడా ధీటైన కౌంటర్లు ఇచ్చింది.. తామింకా రెడ్ బుక్ అమలు చెయ్యలేదని.. చేస్తే వైసీపీ నేతలు ఎవ్వరూ ఉండరని చెప్పుకొచ్చారు.. ఈ వ్యవహారం నడుస్తున్న సమయంలో వైసీపీ అధినేత జగన్ చేసిన గుడ్ బుక్ కాన్సెప్ట్ ఇప్పుడు రెండు పార్టీల్లో హాట్ టాపిక్ గా మారింది..

వైసీపీ అధినేత జగన్ స్టాటజీ మార్చేశారు.. కార్యకర్తల్లో, నేతల్లో ఆత్మస్తైర్యం నింపుతున్నారు.. పార్టీని గాడిలో పెడుతున్నారు.. ఓడిపోయిన నియోజకవర్గాల్లోని ముఖ్యనేతలు, అభ్యర్దులతో వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు.. కొన్ని చోట్ల బాధ్యులను, జిల్లా అధ్యక్షులను మార్చేస్తున్నారు.. ఇదే క్రమంలో ఇటీవల జగన్ చేసిన గుడ్ బుక్ కామెంట్స్ రెండు పార్టీల్లో తీవ్ర చర్చలకు దారి తీస్తున్నాయి.. రెడ్ బుక్ లాగానే తాను కూడా గుడ్ బుక్ రాస్తున్నానని ఆయన ప్రకటన.. కొందరిలో దైర్యాన్ని నింపితే..మరికొందరిలో ఎన్నో అనుమానాలను రేకెత్తిస్తోంది..

అధికారంలో ఉన్న సమయంలో దూకుడుగా వ్యవహరించిన జగన్.. ఇప్పుడు నేతల్లో ఆత్మస్థైర్యం నింపే స్కెచ్ లు వేస్తున్నారు.. వైసీపీ కోసం కష్టపడే వారి పేర్లతో గుడ్‌బుక్‌ రాసుకుంటున్నానని జగన్ చెబుతున్నారు.. ఇక నో రివెంజ్‌ ఓన్లీ గుడ్డే అని చెప్పుకొస్తున్నారు. గుడ్‌బుక్‌లో రాసుకున్నవారందరికీ భవిష్యత్‌లో అవకాశాలు, ప్రమోషన్లు ఉంటాయని నేతలకు భరోసా ఇస్తున్నారు.. పార్టీ కోసం పనిచేసే వారిని గుర్తు పెట్టుకుంటానని జగన్ పదేపదే వ్యాఖ్యానిస్తున్నారు.. దీంతో నేతల్లో, కార్యకర్తల్లో భవిష్యత్ మీద నమ్మకం ఏర్పడుతోందని పార్టీలో చర్చ నడుస్తోంది..

నారాలోకేష్ రెడ్ బుక్ వల్ల కూటమి ప్రభుత్వ ఇమేజ్ డ్యామేజ్ అయిందనే భావన రాజకీయవర్గాల్లో ఉంది.. వైసీపీ నేతలను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశ్యంతో పాలనమీద ఫోకస్ చెయ్యడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.. దీంతో జగన్ చెబుతున్న గుడ్ బుక్ మీద అందరి దృష్టి పడింది.. దీనిపై టీడీపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నా.. రెడ్ బుక్ వర్సెస్ గుడ్ బుక్ అనే కామెంట్స్ మాత్రం వినిపిస్తునే ఉన్నాయి..

Read more RELATED
Recommended to you

Latest news