గన్‌పార్క్ వద్ద ఉద్రిక్తత.. అమరవీరుల స్థూపం వద్ద సాయిబాబా మృతదేహం పెట్టొందంటూ?

-

పౌర హక్కుల నేత, ఢిల్లీ వర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా (56) అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే.శనివారం రాత్రి హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఒక్కసారిగా గుండెపోటు వచ్చినట్లు తెలిసింది. అంతకుముందు 10 రోజుల కిందట జీర్ణకోశ సంబంధిత సమస్యతో ఆయన ఆస్పత్రిలో చేరారు. ఆరోగ్య పరిస్థితి విషమించి రాత్రి 8.45 గంటలకు చివరి శ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు.

ఆదివారం ఆయన మృతదేహాన్ని మౌలాలిలోని తన తమ్ముడి ఇంటి వద్దకు తరలించి సందర్శనార్ధం ఉంచిన విషయం తెలిసిందే. ఇక సోమవారం ప్రొఫెసర్ సాయిబాబా పార్థివ దేహాన్ని అమరవీరుల స్తూపం వద్ద పెట్టేందుకు తరలించారు. అనుకోకుండా అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు సాయిబాబా మృతదేహాన్ని అమరవీరుల స్థూపం వద్ద పెట్టనివ్వకుండా అడ్డుపడ్డారు. దీంతో అంబులెన్స్‌లోనే పార్థివదేహం ఉండిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం తీరుపై సాయిబాబా అభిమానులు, పౌరహక్కుల నేతలు మండిపడుతున్నారు.కాగా, ఆయనకు మావోయిస్టులతో సంబంధాలున్నాయని గతంలో అరెస్టయ్యి జైలులో ఉన్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news