న్యూజిలాండ్ కి షాక్.. టెస్ట్ సిరీస్ నుంచి మరో కీలక ప్లేయర్ ఔట్..!

-

భారత్ తో టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందే న్యూజిలాండ్ జట్టుకు మరో షాక్ తగిలిందనే చెప్పాలి. గాయం కారణంగా ఇప్పటికే మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తొలి టెస్ట్ కి దూరం కాగా.. తాజాగా మరో ఫాస్ట్ బౌలర్ బెన్ సియర్స్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. మోకాలి గాయం కారణంగా టెస్ట్ సిరీస్ మొత్తానికి సియర్స్ దూరమయ్యాడని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. అతని స్థానంలో డఫీని ఎంపిక చేసినట్టు తెలిపింది.

శ్రీలంక పర్యటనలోనే బెన్ సియర్స్ మోకాలి నొప్పితో బాధపడ్డాడు. భారత్ సిరీస్ సమయానికి కోలుకుంటాడని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు భావించి.. అతన్ని ఎంపిక చేసింది. కానీ గత వారమే న్యూజిలాండ్ జట్టు భారత్ కి రాగా.. సియర్స్ మాత్రం అక్కడే ఉండిపోయాడ. స్కానింగ్ గాయం తీవ్రత అధికంగా ఉన్నట్టు తెలిసింది. దీంతో సియర్స్ స్థానంలో జాకబ్ డఫీని ఎంపిక చేసినట్టు ప్రకటించింది. డఫీ ఇంత వరకు టెస్ట్ ఆరంగేట్రం చేయలేదు. కానీ ఫస్ట్ క్లాస్ క్రికెట్ 299 వికెట్లు పడగొట్టాడు.

Read more RELATED
Recommended to you

Latest news