మద్యం దుకాణాలపై అమరావతి వాసులు తిరుగుబాటుకు దిగారు. తాడేపల్లి లో అమరావతి ఐకాన్ అపార్ట్మెంట్ వాసులు నిరసన చేస్తున్నారు. జనావాసాల మధ్య మద్యం షాపులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ….నిరసన తెలుపుతున్నారు అమరావతి ఐకాన్ అపార్ట్మెంట్ వాసులు.
ప్రభుత్వం తక్షణమే ఈ ప్రాంతంలో మద్యం షాపులు తీసేసి జనావాసాలు లేని ప్రాంతంలో మద్యం షాపులు ఏర్పాటు చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు అమరావతి ఐకాన్ అపార్ట్మెంట్ వాసులు. నిరసన తెలుపుతూ ప్లకార్డులతో ప్రదర్శన చేశారు. ఇక అటు ఆంధ్రప్రదేశ్ లో నూతన వైన్స్ షాపులకు ఈనెల 14న లాటరీ పద్దతి ద్వారా ఎంపిక చేసిన విషయం తెలిసిందే.
మంత్రి నారాయణ తన అనుచరుల కోసం రూ.2కోట్ల సొంత డబ్బులతో 100 మంది కార్యకర్తల ద్వారా వైన్స్ షాపులకు దరఖాస్తు చేశారు. 100 దరఖాస్తులకు మూడు షాపులు దక్కాయి. ఒక్కో షాపునకు ఆరుగురు డివిజన్ ఇన్ చార్జీల చొప్పున 18 మందికి ఆయన షాపులను అప్పగించారు. చట్టబద్దంగా వ్యాపారం చేసుకోవాలని వారికి సూచించారు మంత్రి నారాయణ. మరోవైపు కర్నాటక, ఉత్తరప్రదేశ్ కి చెందిన వారు కూడా దక్కించుకోవడం గమనార్హం.