వికారాబాద్ జిల్లా దామగుండం అటవీ ప్రాంతంలో రాడర్ కేంద్రానికి కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ రక్షణలో తెలంగాణ ముందడుగు వేసింది. రాడార్ కేంద్రం పై కొందరూ లేని పోని అపోహలు సృష్టించారు. దేశ భద్రత చాలా ముఖ్యం అన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే రాడార్ కేంద్రానికి అనుమతులు వచ్చాయని గుర్తు చేశారు సీఎం రేవంత్ రెడ్డి.
తమిళనాడులో ఇప్పటికే ఒక రాడార్ కేంద్రం ఉంది. దేశం సురక్షితంగా ఉంటేనే పర్యావరణం గురించి ఆలోచించే అవకాశం ఉంటుంది. పదేళ్లలో తెలంగాణను లూటీ చేసింది. మా ప్రభుత్వం రాడార్ కేంద్రానికి సహకరిస్తుందని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ రాడార్ పై లేనిపోని ఆరోపణలు చేస్తుందని ప్రత్యేకంగా రాజ్ నాథ్ సింగ్ కి తెలిపారు.