జమ్ముకశ్మీర్ సీఎంగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకారం

-

జమ్ముకాశ్మీర్ సీఎంగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకారం చేశారు.బుధవారం ఉదయం 11.30 గంటలకు దాల్ లేక్ ఒడ్డున ఉన్న షేర్ ఐ కాశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్లో ఒమర్ అబ్దుల్లా చేత గవర్నర్ మనోజ్ సిన్హా ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యమంత్రితో పాటు 9 మంది మంత్రులు సైతం ప్రమాణం చేశారు.ఇటీవల జరిగిన జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ 42 స్థానాల్లో విజయం సాధించగా.. నలుగురు స్వతంత్రులు, ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు హాజరయ్యారు.నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ పదేళ్ల తర్వాత జమ్ములో అధికారంలోకి రావడంతో ఆ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ప్రమాణ స్వీకారం అనంతరం సీఎం ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వం ముందు అనేక సవాళ్లు ఉన్నాయన్నారు.జమ్ముకశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేశాక..ప్రమాణ స్వీకారం చేస్తున్న తొలి సీఎంను తానేనన్నారు.గడిచిన పదేళ్లలో ఇక్కడి ప్రజలు అనేక కష్టాలను ఎదుర్కొన్నారని గుర్తుచేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news