దేవిశ్రీ ప్రసాద్ ఈవెంట్ పై వివాదం !

-

హైదరాబాద్ నగరంలో దేవీశ్రీ ప్రసాద్ ఈవెంట్ చేమనున్న విషమం దాదాపు అందరికీ తెలిసిందే. అయితే దాని గురించి రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా  సీఎం రేవంత్ ఆదేశాలను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ అధికారులు బేఖాతరు చేశారని పేర్కొంటున్నారు. వాస్తవానికి హైదరాబాద్ లోని  గచ్చిబౌలి స్టేడియం లో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈవెంట్ నిర్వహించనున్నారు.

ఈ ఈవెంట్ కి ఈనెల 19 న గచ్చిబౌలి ఫుట్ బాల్ స్టేడియంలో దేవిశ్రీ ఈవెంట్ జరుగనుంది. అయితే ఈవెంట్ కోసం స్టేడియంలోని అథ్లెటిక్ ట్రాక్ పై వేసిన భారీ సెట్.. దీంతో స్టేజి కోసం స్టేడియం లో భారీగా గుంతలు తవ్వకాలు చేపట్టారు.  ఇలాంటి ఈవెంట్స్ వల్ల క్రీడాకారుల సాధనకు ఆటకం అని క్రీడాభిమానుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక స్టేడియంను ఇటీవలే రూ. 20 కోట్లు ఖర్చు పెట్టి బాగు చేసిన విషయం తెలిసిందే. స్టేడియాలను ఇకపై క్రీడేతర కార్యక్రమాల నిర్వహణకు, ఈవెంట్స్ ఇవ్వమని సీఎం స్వయంగా ప్రకటించాక కూడా తీరు మార్చుకోని శాట్ సిబ్బంది అని వార్తలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news