గ్రూపు 1 పోస్టుల భర్తీలో జీవో 29ని రద్దు చేయాలి : కేటీఆర్

-

తెలంగాణలో గ్రూపు 1 అభ్యర్థులు నిరసనలు తెలిపారు. పాత జీవో 55నే కొనసాగించాలని.. కొత్తగా తీసుకొచ్చిన జీవో 29తో మళ్లీ గ్రూపు 1 పరీక్ష రద్దు అయ్యే అవకాశం ఉంటుందని వెల్లడించారు నిరుద్యోగులు. ఇవాళ తెలంగాణ భవన్ కేటీఆర్ తో కలిసి సమస్యను వివరించారు. అలాగే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను కలిసి సమస్యను తెలిపారు. తాజాగా తెలంగాణ భవన్ లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.  భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు. 95 శాతం కొలువులు మన బిడ్డలకే దక్కాలని మోడీ పై పోరాటం చేసిన ఘనత కేసీఆర్ కే దక్కిందన్నారు. భారతదేశంలో ఎక్కడా జిల్లాకో మెడికల్ కళాశాల లేదు. తెలంగాణ లో మాత్రమే ఉంది. పోరాటాలు మనకు కొత్త కాదు. రాజకీయ ఉడ్డంకులతోనే మన పార్టీ కొట్లాడింది. చిట్టినాయుడు మనకు ఓ లెక్క కాదు.

గుంపు మేస్త్రీ అంటే కట్టేటోడు.. కానీ చిట్టినాయుడు కూల్చివేస్తాడని సంచలన వ్యాఖ్యలు చేశారు కేటీఆర్.  వందలాది మంది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆత్మహత్యలు చేసుకున్నారు. నీళ్లల్లో సంపూర్ణ విజయం సాధించామని తెలిపారు. దశాబ్దాల ఘోస నల్గొండలో ప్లోరిసిస్ తగ్గించాం. కొత్తగా ఏర్పడిన తెలంగాణలో తలసరి ఆదాయం.. 14వ స్థానం. దిగిపోయే నాటికి తలసరి ఆదాయంలో నెంబర్ వన్ స్థానానికి చేరుకున్నామని గుర్తు చేశారు. నియామకాల విషయానికి కొస్తే.. గ్రూపు 1 పోస్టుల భర్తీలో  జీవో 29ని రద్దు చేయాలి గ్రూపు 1 అర్హత సాధించిన వారు తెలంగాణ భవన్ కి వచ్చి కలిసారు. పదోతరగతి పాస్ అయితే 10వేలు.. డిగ్రీ పాస్ అయితే రూ.25వేలు ఇస్తానన్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై ధ్వజమెత్తారు. 

Read more RELATED
Recommended to you

Latest news