మీ శరీరంలో మెగ్నీషియం తగ్గిపోతే కనిపించే లక్షణాలు తెలుసా..?

-

మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే దానికి కావాల్సిన విటమిన్లు, పోషకాలు ఖనిజాలు, మూలకాలు సరైన పాళ్లలో అందాలి.

ఏదైనా మూలకం మన శరీరంలో లోపిస్తే దాని లక్షణాలు బయటకు కనిపిస్తాయి.
ప్రస్తుతం శరీరంలో మెగ్నీషియం తక్కువైతే కనిపించే లక్షణాలు ఏంటో తెలుసుకుందాం.

Magnesium: The Benefits, Usage & Differences

మన శరీరంలో 300రకాల జీవరసాయనిక చర్యలు జరగడానికి మెగ్నీషియం అవసరం అవుతుంది. దానిలో.. శరీరంలో శక్తిని ఉత్పత్తి చేయడం దగ్గర నుండి, కండరాలను నరాలను సరిగ్గా పని చేయించడం, రక్త ప్రసరణను నియంత్రణలో ఉంచటం వరకు ఎన్నో చర్యలు ఉన్నాయి.

అయితే డైలీ రొటీన్ సరిగ్గా లేకపోవడం వల్ల మెగ్నీషియం బాడీకి సరైన స్థాయిలో అందకుండా ఉంటుంది. ఇలాంటప్పుడే బాడీలో అనేక సంకేతాలు కనిపిస్తాయి.

కండరాలు పట్టేయడం:

శరీర కండరాలు పట్టేయడం అనేది మెగ్నీషియం లోపం వల్లనే సంభవిస్తుంది. సాధారణంగా మెగ్నీషియం తక్కువున్న వారిలో ఇది మొదటి సంకేతంలా కనిపిస్తుంది.

వాంతులు:

ఏది తిన్నా వాంతులవడం కూడా మెగ్నీషియం లోపం వల్లనే కలుగుతుంది. అంతేకాదు తీవ్రమైన అలసట ఉంటుంది. ఆకలి కాకపోవడం, శరీరం బలహీనంగా ఉండటం, వికారం మొదలగు లక్షణాలన్నీ మెగ్నీషియం లోపం వల్లనే సంభవిస్తాయి.

పై లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్‍ని సంప్రదించడం మంచిది. మెగ్నీషియం లోపం విషయంలో ఆలస్యం చేస్తే అనేక అనర్ధాలు జరుగుతాయి. ముఖ్యంగా యువతలో ఎముక సాంద్రత తగ్గిపోయి బలహీనంగా మారుతాయి. ఈ కారణంగా చిన్న యాక్సిడెంట్ అయినా కూడా ఎముకలు విరిగే ప్రమాదం ఎక్కువ.

మెగ్నీషియం సప్లిమెంట్స్

బాడీలో తగినంతగా మెగ్నీషియం స్థాయిలు లేకపోతే.. సప్లిమెంట్స్ వాడవచ్చని డాక్టర్స్ సలహా ఇస్తున్నారు. మెగ్నీషియం సప్లిమెంట్లలో చాలా రకాలు ఉన్నాయి. అందుకే ఈ విషయంలో డాక్టర్ ని సంప్రదించడం మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news