సీనియర్ నాయకులు జేసీ దివాకర్‌రెడ్డి గురించి ఓ ఆసక్తి కరమైన విషయం తెరపైకి వచ్చింది. జేసీ దివాకర్‌రెడ్డి బయోపిక్ త్వరలో తెరకెక్కనుంది. జూటూరు రాజు పేరుతో ఓ ప్రముఖ దర్శకుడు తెరకెక్కించనున్నట్టు టాక్ వినిపిస్తోంది. జేసీ దివాకర్‌రెడ్డి పాత్రలో రాజేంద్రప్రసాద్ నటించనున్నారని సమాచారం అందుతోంది.

ఇక ఇప్పటికే టైటిల్ ఖరారు అయినట్టు సమాచారం అందుతోంది. “జూటూరు రాజు” గా JC దివాకర్ రెడ్డి బయోపిక్ కు పేరు పెట్టారట. బయోపిక్ కు JC కుటుంబ సభ్యులు అనుమతి ఇచ్చినట్టు సమాచారం అందుతోంది. త్వరలో అనంత రానున్నారట ఆ ప్రముఖ డైరక్టర్. జెసి దివాకర్ రెడ్డి క్యారెక్టర్ కు రాజేంద్రప్రసాద్ నీ ఎంచుకున్నట్టు సమాచారం అందుతోంది. కాగా జెసి దివాకర్ రెడ్డి కుటుంబం ఇప్పుడు టీడీపీ పార్టీలో ఉన్న సంగతి తెలిసిందే.