ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం ఎన్టీఆర్ భవన్‌లో కీలక సమావేశం జరగనుంది.తెలుగుదేశం పార్టీ ప్రజా ప్రతినిధులైన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వ విజయాలు, సభ్యత్వ నమోదు సహా 8 అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
అదేవిధంగా టీడీపీ సభ్యత్వ నమోదు, పంచాయతీ రాజ్ వ్యవస్థ, పల్లె పండుగ, సూపర్ సిక్స్ పాలసీలపై సీఎం చంద్రబాబు ఈ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే క్షేత్రస్థాయిలో ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో పార్లమెంట్ సభ్యులను అడిగి తెలుసుకోనున్నారు. అంతేకాకుండా గత ఎన్నికల టైంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీల అమలుకు సంబంధించి కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారని టాక్ వినిపిస్తోంది.