ఏపీ ప్రభుత్వం మందుబాబుల కోసం ప్రత్యేకంగా రూ.99కే క్వార్టర్ బాటిల్స్ అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయినప్పటికీ తమకు ఇంకా సర్య్కూరల్ రాలేదని వైన్స్ షాప్ ఓనర్లు క్వార్టర్ బాటిల్‌ను రూ.180 వరకు అమ్ముతూ వచ్చారు. తాజాగా రూ.99లకు క్వార్టర్ బాటిల్ అందుబాటులోకి వచ్చిందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ సంచాలకులు నిషాంత్ కుమార్ తెలిపారు. మద్యం తయారీ విక్రయాల్లో జాతీయ స్థాయిలో పేరు ప్రతిష్టలు కలిగిన 5 సంస్థలు ఏపీలో తక్కువ మద్యం విక్రయాలు చేసేందుకు అంగీకరించాయన్నారు.
గురువారం నాటికి 10 వేల కేసుల రూ.99 మద్యం మార్కెట్‌కు చేరిందని, సోమవారం వరకు రోజువారీ సరఫరా 20 వేల కేసులకు చేరుతుందన్నారు.దశల వారీగా సరఫరా పెరిగి ఈ నెలాఖరు నాటికి 2,40,000 కేసుల మద్యం రాష్ట్రంలో అందుబాటులో ఉంటుందని తెలిపారు. మొత్తంగా 1 కోటి 20 లక్షల క్వార్టర్ సీసాల మద్యం ఈ నెలలోనే అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. డిమాండ్‌కు అనుగుణంగా వచ్చే నెలలో స్టాక్ దిగుమతి చేసుకోవాలనే దానిపై ర్ణయం తీసుకుంటామని నిషాంత్ తెలిపారు.