ఈషా ఫౌండేషన్‌కు భారీ ఊరట..ఆ కేసు కొట్టేసిన సుప్రీంకోర్టు..!

-

ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్జీ వాసుదేవ్ కి భారీ ఊరట లభించింది. సద్గురుకు చెందిన ఈషా ఫౌండేషన్ పై నమోదు అయిన కేసును తాజాగా సుప్రీంకోర్టు కొట్టేసింది. తన ఇద్దరూ కూతుళ్లను సద్గురు బ్రెయిన్ వాష్ చేశారని.. వాళ్లను ఈషా యోగా సెంటర్ నుంచి బయటికి రానివ్వడం లేదంటూ ఓ వ్యక్తి ఇటీవలే హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ జరిపింది.

ఆ ఇద్దరూ మహిళలు ఈషా కేంద్రంలో స్వచ్ఛందంగానే ఉంటున్నారని సుప్రీంకోర్టుకు పోలీసులు తెలిపారు. పోలీసులు సమర్పించిన వివరాలను పరిశీలించిన ఉన్నత న్యాయస్థానం.. ఈ కేసును కొట్టేస్తూ.. ప్రధాన న్యాయమూర్తి డీ.వై.చంద్రచూడ్  నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెల్లడించింది.   కోయంబ‌త్తూరులోని త‌మిళ‌నాడు అగ్రిక‌ల్చర్ యూనివ‌ర్సిటీ ప్రొఫెస‌ర్ ఎస్ కామ‌రాజ్ ఆ కేసు ఫైల్ చేశారు. 42, 39 ఏళ్లు ఉన్న ఇద్దరు కూతుర్లను స‌ద్గురు బ్రెయిన్‌వాష్ చేశార‌ని, వాళ్లను ఈషా యోగా సెంట‌ర్‌ నుంచి బయటకు రానివ్వడం లేదంటూ ఆరోపించారు. ఈ మేరకు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇటీవలే ఈ కేసుపై మద్రాసు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా ఇద్దరు మహిళలు కోర్టుకు హాజరయ్యారు. త‌మ ఇష్ట ప్రకార‌మే ఈషా ఫౌండేష‌న్‌లో ఉంటున్నట్లు చెప్పారు. త‌మ‌ను ఎవ‌రూ బంధించ‌లేద‌ని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news