చంద్రబాబు సారా, ఇసుక మత్తు నుంచి బయటపడాలి : సీదిరి అప్పలరాజు

-

గుర్లలలో డయేరియా పరిస్థితి రాష్ట్ర మే కాదు దేశం ఉలిక్కి పడేలా ఉన్నాయి.. వందల మంది డయేరియా బారిన పడ్డారు. ఇంకా చుట్టుపక్కల గ్రామాలకు విస్తరిస్తోంది అని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. గుర్లలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. కానీ ఇక్కడ కనీస సౌకర్యల్లేవు. ఇంత జరిగితే శిబిరంలో పది బెడ్డులు కూడా ఏర్పాటు చేయలేరా. కుర్చీలు, బెంచీలు మీద కూర్చోబెట్టి వైద్యం అందిస్తున్నారే. మా ప్రభుత్వంలో నాడు నేడు కింద సమకూర్చిన సౌకర్యాలను వినియోగిస్తున్నారు.. మేము సమకూర్చిన బెంచీలు లేకపోతే నేల మీద పడుకోబెట్టి వైద్యం చేస్తారా.. ఇదా ప్రభుత్వం స్పందించే తీరు అని ప్రశ్నించారు.

మందులు కూడా సక్రమంగా సరఫరా జరగడం లేదు. చంద్రబాబు సారా, ఇసుక మత్తు నుంచి బయటపడాలి. ప్రజారోగ్యం పడకేసింది. ఇంత దయనీయ పరిస్థితులు ఏ రాష్ట్రంలోనూ లేవు. మంత్రులు, అధికారులు వచ్చి చూసి వెళ్లిపోతున్నారు తప్ప చర్యలు లేవు. లోకేష్ సర్ప్రైజ్ విజిట్స్ చేస్తుంటారు. మరి ఇక్కడకు ఎందుకు రాలేదు లోకేష్. జగన్ ని విమర్శించడానికి మీకు సమయం ఉంటాదా.. ప్రైవేట్ కంపెనీల్లో ప్రమాదం జరిగితే డబ్బులు ముక్కుపిండీ మరీ వసూలు చేస్తున్నారు. మరి ఈ మరణాలకు ప్రభుత్వం ఎందుకు బాధ్యత తీసుకోదూ. ఖచ్చితంగా మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలి అని సీదిరి అప్పలరాజు డిమాండ్ చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news