మరో మూడేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తాం : మంత్రి నారాయణ

-

గత ప్రభుత్వ హయాంలో ఎటువంటి అభివృద్ధికి నోచుకోని అమరావతి రాజధాని నిర్మాణ పనులను త్వరలోనే తిరిగి ప్రారంభిస్తామని ఏపీ మంత్రి నారాయణ స్పష్టంచేశారు. రాజధాని నిర్మాణం మరో మూడు సంవత్సరాలలో పూర్తి చేస్తామన్నారు. ఇక,సీఆర్డీఏ‌ బిల్డింగ్ గత టీడీపీ ప్రభుత్వం హయాంలోనే పూర్తి అయ్యిందని చెప్పారు. ఇంకా, మిగిలి ఉన్న పెండింగ్ పనులను పూర్తి చేయడానికే తిరిగి పనులను ప్రారంభిస్తామన్నారు.

గతంలో సీఆర్డీఏ పరిధిలో పెట్టుబడులు పెట్టిన వారికి భూములిచ్చాం అని చెప్పిన మంత్రి..పెట్టుబడులు పెట్టిన వారికి మౌలిక వసతులు కల్పిస్తామన్నారు.ట్రంక్ రోడ్లు, కాలువలు, నీరు వంటి వసతులు కల్పిస్తామని తెలిపారు. అన్ని టెండర్లను నిర్ణీత సమయంలో పూర్తి చేస్తామని చెప్పారు. వచ్చే ఏడాది జనవరి నాటికి టెండర్లు పూర్తి చేసి పనులు వేగవంతంగా జరిగేలా చూస్తామన్నారు. కాగా, గత వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో అమరావతి నిర్మాణాన్ని గాలికి వదిలేసిన విషయం తెలిసిందే.

 

 

Read more RELATED
Recommended to you

Latest news