తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. విద్యా కమిషన్ సలహా కమిటీ ఏర్పాటు

-

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విద్యా కమిషన్ సలహా కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ప్రదానంగా ఈ కమిటీలో ఆరుగురు సభ్యులు ఉన్నారు. ఈ సభ్యుల్లో ప్రొఫెసర్ హరగోపాల్, కేయూ రిటైర్డ్ ప్రొఫెసర్స్ కె.మురళీ మోహన్, కె. వెంకట నారాయణ, శాతవాహన యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత, ఎంవీ ఫౌండేషన్ కన్వీనర్ వెంటకరెడ్డి,
యునిసెఫ్ విద్యా నిపుణుడు కెఎం శేషగిరి లు ఉన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక సీఎం రేవంత్ రెడ్డి విద్య మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అందులో భాగంగా ఇటీవల విద్యా కమిషన్ ను, దాని కమిషనర్ తో పాటు సభ్యులను నియమించారు. తాజాగా ఇవాళ విద్యా కమిషన్ కు సలహా కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణలో విద్యా విధానం పై విద్యా కమిషన్ కు ఈ కమిటీ సలహాలు, సూచనలు ఇస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news