జనసేనలో ఇతర పార్టీల నాయకులు చేరడం వల్ల మాకు విశ్వాసాన్ని మరింత పెంచాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. జనసేనలో చేరిన పలువురికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు మాపై నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించారని.. అందుకే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని తెలిపారు.
గుడివాడ ప్రాంతంలో తాగునీటి సమస్య ఉందని.. మా దృష్టికి వచ్చింది.. వెంటనే చర్యలు చేపట్టాలని నిధులు మంజూరు చేసినట్టు తెలిపారు. ప్రజలకు కావాల్సిన కనీస అవసరాలు తీర్చడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. అందుకు అవసరమైన నిధులు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని చెప్పారు. ముఖ్యంగా పంచాయతీ శాఖలో అవినీతి అనే పదానికి చోటు లేకుండా తయారు చేస్తామన్నారు. అధికారులు ఎవరికైనా లంచం అని అడిగితే వారిని ఇంటికి పంపిస్తామని హెచ్చరించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పల్లె పండు ద్వారా గ్రామాల్లో అభివృద్ధికి బాటలు పడ్డాయని.. గతంలో పంచాయతీ రాజ్ శాఖలో ఎన్నడూ లేని విధంగా పని చేస్తుందని ప్రజలు కూడా పూర్తిగా సహకరిస్తున్నారని తెలిపారు.