మేమేమన్న దీవానాగాళ్లమా..అంటూ అధికారంలోకి రాకముందు రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియోను షేర్ చేశారు బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడడని.. రైతు బంధు అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు కేటీఆర్. “రైతుబంధు ఎందుకు బందైతది? మేమేమన్న దీవానాగాళ్లమా, నాకేమన్నా ధమాక్ లేదా? రైతుల కష్టాలు మాకు తెల్వదా? “ అంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు.
7,500 కోట్లు వానాకాలం రైతుబంధు ఎగ్గొడుతనంటున్న ఈయనను, నేడు తెలంగాణ రాష్ట్ర రైతులు ఏమనుకుంటారంటారు? అంటూ ప్రశ్నించారు. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలే సమాధానం చెప్పాలని.. కోరారు. అన్యాయంగా రైతులను మోసం చేశాడని.. ఇప్పుడు రైతు బంధు ఇవ్వను అంటున్నారని ఆగ్రహించారు బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి –
“రైతుబంధు ఎందుకు బందైతది? మేమేమన్న దీవానాగాళ్లమా, నాకేమన్నా ధమాక్ లేదా? రైతుల కష్టాలు మాకు తెల్వదా? “
7,500 కోట్లు వానాకాలం రైతుబంధు ఎగ్గొడుతనంటున్న
ఈయనను, నేడు తెలంగాణ రాష్ట్ర రైతులు ఏమనుకుంటారంటారు? pic.twitter.com/n2bBKdIW00— KTR (@KTRBRS) October 21, 2024