ఢిల్లీ పేలుడులో ఖలీస్తానీ ఉగ్రవాదుల హస్తం?

-

దేశ రాజధాని ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో ఆదివారం భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ప్రశాంత్ విహార్‌లో గల సీఆర్‌పీఎఫ్ పబ్లిక్ స్కూల్ సమీపంలో ఈ భయానక ఘటన జరగ్గా, దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.పేలుడు ధాటికి పాఠశాల గోడలు ధ్వంసం అవ్వగా.. దగ్గరలోని వాహనాల అద్దాలు కూడా పగిలినట్టు స్థానికులు వెల్లడించారు. వెంటనే రంగంలోకి దిగిన ఎన్ఐఏ, ఎన్ఎస్‌జీ దీనిపై విచారణ చేపట్టాయి.

అయితే, పేలుడు సంభవించిన ప్రాంతంలో వైట్ పౌడర్‌ను అధికారులు గుర్తించారు. దానిపై ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. కాగా, ఢిల్లీ పేలుడు ఘటనలో ఖలిస్థానీ ఉగ్రవాద సంస్థ హస్తం ఉన్నట్లు అనుమానాలు రేకెత్తుతున్నాయి.పేలుడు ఘటనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదవ్వగా..సీసీ ఫుటేజ్ ఆధారంగా అనుమానితులను పోలీసులు గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. పేలుడుకు ముందు రోజు రాత్రి నిందితుడు ఆ ప్రాంతంలో తిరిగినట్టు గుర్తించారు. నిందితుడు వైట్ టీషర్ట్ ధరించినట్లు గుర్తించారు. పాలిథిన్ కవర్‌లో బాంబును తెచ్చి పెట్టినట్లు పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news