ఉల్లి టీ తో గుండె ఆరోగ్యం పదిలం..! ఇంకా ఎన్నో లాభాలు..

-

ఉల్లి లేని వంటిల్లు ఉండదు.. ఏ కూరలో అయినా ఉల్లిపాయను వాడతారు.. ఉల్లి అంటు ఆరోగ్యానికి ఇటు అందానికి రెండు విధాలుగా మేలు చేస్తుంది. ఉల్లిని పేస్ట్‌ చేయడం, ముక్కలుగా చేసి కూరల్లో వాడుకోవడం మాత్రమే మనం చేసి ఉంటాం.. ఉల్లిని టీలా చేసుకోని తాగడం గురించి మీకు తెలుసా..? అధిక కొలెస్ట్రాల్ సమస్య నేడు అందరికీ ఉంటుంది. జీవనశైలి ఆరోగ్యకరంగా లేకపోవడం, చెడు ఆహారపు అలవాట్లు ఇందుకు ప్రధాన కారణాలుగా ఉంటున్నాయి.

ఆహారం విషయంలో చాలా మంది రుచికే ప్రాధాన్యతనిస్తారు. ఆరోగ్యాన్ని, పోషక విలువలను గాలికొదిలేస్తారు. నూనె పదార్థాలు అతిగా తినడం, వ్యాయామం చేయకపోవడం వల్ల కొలెస్ట్రాల్ సమస్య వస్తుంది.. అది అనేక అనర్థాలకు దారితీస్తుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గించాలంటే.. ఉల్లి టీ ని తాగొచ్చు అని నిపుణులు అంటున్నారు.

అధిక కొలెస్ట్రాల్ తగ్గించడంలో ఉల్లిపాయ టీ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పుదీనా, చమోమిలే, మందార వంటి కొన్ని ప్రత్యేక రకాల టీల గురించి విని ఉంటారు. కానీ ఉల్లిపాయ టీ చాలా అరుదు. ఇది రుచిలో కాస్త వెగటుగానే ఉంటుంది. అయినప్పటికీ, గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఉల్లిపాయలు తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్‌ను తగ్గించడంలో సహాయపడే ఫ్లేవనాయిడ్‌లను కలిగి ఉండటమే ఇందుకు కారణం.

ఉల్లిపాయ టీ ఆరోగ్య ప్రయోజనాలు..

ఉల్లిపాయల్లో కొన్ని ఫ్లేవనాయిడ్లు, పాలీఫెనాల్స్ ఉంటాయి. ఈ రెండూ మంచి యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేసి రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఆక్సీకరణ నష్టం నుంచి రక్త నాళాల గోడలను రక్షించడానికి ఇవి పనిచేస్తాయి.

ఉల్లిపాయ టీలో యాంటీ ఆక్సిడెంట్లు, వాటి సమ్మేళనాలు వాపుతో పోరాడి ట్రైగ్లిజరైడ్స్‌ను కూడా తగ్గిస్తాయి. అలాగే, ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి.. దాని వలన గుండె జబ్బుల ప్రమాదాన్ని మరింత తగ్గిస్తుంది. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు అధిక రక్తపోటును తగ్గించి, రక్తం గడ్డకట్టకుండా నిరోధించడంలో సహాయపడతాయి.

ఉల్లిపాయ టీ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇది శరీరంలో చెడు లిపిడ్‌లు పేరుకుపోకుండా నిరోధిస్తుంది. అలాగే.. ఇది మంచి కొలెస్ట్రాల్‌ను ప్రోత్సహిస్తుంది. దీన్ని తాగడం వల్ల రక్తనాళాలు కూడా శుభ్రపడతాయి.

ఉల్లిపాయ టీ ఎలా తయారు చేయాలి..

ఉల్లిపాయ టీ తయారు చేయడం పెద్ద కష్టమైన పని ఏం కాదు.. ముందుగా ఒక ఉల్లిపాయను కోసి 2 కప్పుల నీళ్లలో వేసి మరిగించాలి. గిన్నెలోని నీరు సగం అయ్యేవరకు మరిగించండి.. ఆ తర్వాత ఈ నీటిని ఒక కప్పులోకి వడకట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు కొద్దిగా తేనె, నిమ్మరసం కలుపుకొని తాగాలి. ఇలా ఉదయం లేదా సాయంత్రం ఎప్పుడైనా తాగొచ్చు..

Read more RELATED
Recommended to you

Latest news