రాష్ట్రంలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు మరికొద్దిసేపట్లలో ప్రారంభం కానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఇంటివద్ద భారీగా మోహరించారు. బంజారాహిల్స్‌లోని నందినగర్‌లో ఉన్న ఆయన ఇంటి వద్దకు పోలీసు బలగాలు పెద్ద ఎత్తున చేరుకున్నాయి. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు ఎటువంటి ఆటంకం కలిగించకుండా ఉండేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా ఆయన్ను హౌస్ అరెస్టు చేయనున్నట్లు సమాచారం.
గ్రూప్-1 అభ్యర్థులను కలిసి వారి కేటీఆర్ రెచ్చగొడుతారని అనుమానంతో ముందస్తుగా భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. కేటీఆర్ సహా పలువురు బీఆర్ఎస్ నేతల ఇళ్ల వద్ద కూడా భారీగా పోలీసులు మోహరించారు. కాంగ్రెస్ సర్కార్ జీవో 29ను రద్దు చేయాలని అభ్యర్థులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు.మెరిట్ అభ్యర్థులకే రిజర్వేషన్లను వర్తింప జేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలవ్వగా.. కోర్టు తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.