మ‌హారాష్ర్ట ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ వ్యూహం ఇదే….!

-

బీజేపీ ఓట‌మే ల‌క్ష్యం….ఏ రాష్ర్టంలో ఎన్నిక‌లు జ‌రిగినా కాంగ్రెస్ పార్టీ చెప్తున్న మాట ఇది. కాషాయ పార్టీ ఓట‌మే ల‌క్ష్యంగా కాంగ్రెస్ పార్టీ నేత‌లు ఎన్నిక‌ల ప్ర‌ణాళిక‌లు రచిస్తున్నారు. ఈ ల‌క్ష్యంతోనే హ‌ర్యానా అసెంబ్లీకి జ‌రిగిన ఎన్నిక‌ల్లో బ‌రిలోకి దిగిన కాంగ్రెస్… విజ‌యంపై కొండంత విశ్వాసం క‌న‌బ‌రిచింది. కానీ చివ‌రికి విజ‌యం ముంగిట చ‌తికిల‌బ‌డింది. అలాగే జ‌మ్మూక‌శ్మీర్ ఎన్నిక‌ల్లోనూ కాంగ్రెస్‌దే విజ‌య‌మ‌ని భావించినా ఆశించిన స్థాయిలో ఫ‌లితాలు రాలేదు. ఇప్పుడు మ‌హారాష్ర్ట‌లో జ‌రునున్న అసెంబ్లీ ఎన్నిక‌లు కాంగ్రెస్ పార్టీ స‌మ‌ర్థ‌త‌కు ప‌రీక్ష‌గా మారాయి.

అటు జార్ఖండ్ ఎన్నిక‌ల్లోనూ ఆచితూచి అడుగులేయాల‌ని భావిస్తోంది. సీట్ల‌ ఖరారులో మిత్రపక్షాలతో తగ్గి మంతనాలు సాగిస్తోంది. బీజేపీపైన నెగ్గటం కోసం అవసరమైతే తమ సీట్లు తగ్గించుకోవటానికి సిద్దప‌డుతోంది కాంగ్రెస్‌.తాజాగా రెండు రాష్ట్రాల పార్టీ నాయకత్వానికి రాహుల్ సీట్ల ఖరారు పైన మార్గనిర్దేశం చేశారు. మిత్ర‌ప‌క్షాల నిర్ణ‌యాల‌ను గౌర‌విస్తామ‌ని బ‌హిరంగ ప్ర‌క‌ట‌న చేయ‌డ‌మే కాదు వారి గెలుపున‌కు కృషి చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

మహారాష్ట్ర..జార్ఖండ్ రాష్ర్టాల్లో వ‌చ్చే నెల‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగ‌నున్నాయి.దీనికి సంబంధించిన నోటిఫికేష‌న్ విడుద‌ల కాగా ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్యర్ధుల ప్రకటన‌ ప్రక్రియ కూడా మొదలైంది. రెండు కూటములు మిత్రపక్ష పార్టీలతో సీట్ల సర్దుబాటుపైన కసరత్తు చేస్తున్నాయి. ఒప్పందం కుదిరిన నియోజకవర్గాల్లో తమ అభ్యర్ధులను ప్రకటిస్తున్నాయి. మిత్రపక్షాలు సీట్ల కోసం రెండు కూటముల్లోనూ కాంగ్రెస్ – బీజేపీ పైన ఒత్తిడి పెంచుతున్నాయి.కాగా హర్యానా ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ లో మార్పు తెచ్చాయి. మహారాష్ట్రలో కాంగ్రెస్ నాయకత్వం 125 సీట్లలో పోటీ చేయాలని తొలుత భావించింది. రాష్ట్ర పార్టీ నేతలు ఇందుకు సిద్దమయ్యారు కూడా.

అయితే, ఇప్పుడు కాంగ్రెస్ ఆ సంఖ్యను 10 5- 110 కి త‌గ్గించింది. మిత్రపక్షాలకు ప్రాధాన్యత ఇవ్వాలని డిసైడ్ అయింది.ప‌ది సీట్ల‌ను తాను త‌గ్గించుకుని కూట‌మిలో ఉన్న పార్టీల‌కు ఇస్తోంది.మిత్రపక్షాలకు సానుకూల సంకేతం పంపేందుకు కాంగ్రెస్ తమ సీట్లను తగ్గించుకుంటోందని విశ్లేష‌కులు చెప్తున్నారు. అదే విధంగా జార్ఖండ్ లో కాంగ్రెస్ 2019 ఎన్నికల్లో 31 సీట్లలో పోటీ చేసింది. తాజాగా 33 సీట్లలో పోటీకి కసరత్తు చేసింది. అయితే, మిత్రపక్షాల నుంచి సీట్ల కోసం వస్తున్న ఒత్తిడితో ఇప్పుడు 29 సీట్లలో పోటీకి కాంగ్రెస్ సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది.

జార్ఖండ్ రాష్ర్టంలో ఇండియా కూటమిలో ప్రధాన పార్టీగా ఉన్న జేఎంఎం 45 స్థానాల్లో పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. 2019లో ఏడు స్థానాల్లో పోటీ చేసిన ఆర్జేడీ తిరిగి అదే సంఖ్య కు పరిమితం అయ్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. దీంతో, సీట్ల విషయంలో నేరుగా రంగంలోకి దిగిన‌ రాహుల్ మిత్రపక్షాలతో చర్చలు చేస్తున్నారు.జేఎంఎం అధినేత హేమంత్ సోరెన్, మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రేతోనూ రాహుల్ చర్చలు జరిగాయి.మహారాష్ట్రలో విదర్భ ప్రాంతంలో కాంగ్రెస్ బలంగా ఉండటంతో ఆక్కడ కాంగ్రెస్ ఎక్కువ సీట్లలో పోటీ చేయాలని భావిస్తోంది. మిత్రపక్షాలకు ప్రాధాన్యత ఇస్తూనే తాము బలంగా ఉన్న స్థానాలను మాత్రం పోటీ చేయాలని నిర్ణ‌యించుకుంది. మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి పోటీ చేసే స్థానాలపైన మ‌రో రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.అటు మిత్ర పక్షాలకు ప్రాధాన్యత ఇస్తూ.. బీజేపీ కూటమి ఓటమే లక్ష్యంగా పని చేయాలని రాహుల్ గాంధీ ఎన్నిక‌ల ప్ర‌ణాళిక‌లు

Read more RELATED
Recommended to you

Latest news