కరీంనగర్ గులాబీ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఇంత తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇవాళ గంగుల కమలాకర్ తల్లి మరణించారు. గత కొన్ని రోజులుగా… తీవ్ర అనారోగ్యంతో గంగుల కమలాకర్ తల్లి బాధపడుతున్నారు. ఈ తరుణంలోనే తాజాగా ఆసుపత్రికి కూడా తీసుకువెళ్లారట కుటుంబ సభ్యులు. అయితే ఆమె పరిస్థితి విషమించడంతో… సోమవారం రాత్రి మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని గులాబీ పార్టీ కూడా గుర్తించింది.
దీంతో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తల్లికి సంతాపం తెలుపుతున్నారు నేతలు. అలాగే గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు గులాబీ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు, తారక రామారావు అలాగే హరీష్ రావు. అంతేకాదు కేటీఆర్ అలాగే హరీష్ రావు నేరుగా గంగుల కమలాకర్ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించే ఛాన్స్ ఉన్నట్లు వార్తలు… వస్తున్నాయి. ఇవాళ సాయంత్రం కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తల్లి అంతక్రియలు జరగనున్నట్లు తెలుస్తోంది.