ఇవాళ ఏపీ క్యాబినెట్ సమావేశం జరుగనుంది. మహిళలకు ఏడాదికి మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ పథకం విధి విధానాలకు ఆమోద ముద్ర వేయనుందట మంత్రివర్గం. కేంద్రం అమలు చేస్తున్న ఉజ్వల పథకం లబ్దిదారులు.. పథకానికి అర్హుల ఎంపిక.. ఆర్దిక భారం వంటి అంశాల పైన చర్చించి అర్హుల ఎంపిక పైన తుది నిర్ణయం తీసుకోనుంది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో చెత్త పన్ను రద్దు పైన ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన చేసారు. ఈ నిర్ణయం అమలుకు ఆమోద ముద్ర వేయనున్న మంత్రివర్గం…చెత్త పన్ను రద్దు ప్రతిపాదనపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది. 13 కొత్త మున్సిపాలిటీల్లో 190 కొత్త పోస్టుల భర్తీ ప్రతిపాదనపై చర్చించనున్న మంత్రివర్గం… దేవాలయాల పాలక మండలిని 15 మంది నుంచి 17 మందికి పెంచే ప్రతిపాదనపై చర్చ, నిర్ణయం తీసుకోనుంది.
పాలక మండళ్లలో ఇద్దరు బ్రాహ్మణులను సభ్యులుగా నియమించే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించిన మార్గదర్శకాల పైన మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారని సమాచారం అందుతోంది. వాలంటీర్ల సర్వీసు కొనసాగింపు.. వేతనాల చెల్లింపు పైన మంత్రివర్గం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.