ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్.. కోహ్లీని అధిగమించిన పంత్

-

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బుధవారం తాజా టెస్ట్ ర్యాంకింగ్స్ ని విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్స్ లో చాలా రోజుల తర్వాత రిషబ్ పంత్ అత్యుత్తమ ర్యాంక్ ని అందుకున్నాడు. ఇటీవల న్యూజిలాండ్ తో బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో రెండు ఇన్నింగ్స్ లో 20, 99 పరుగులు చేసిన రిషబ్ పంత్.. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో మూడు స్థానాలు పైకి ఎగబాకి ఆరవ స్థానానికి చేరుకున్నాడు.

విరాట్ కోహ్లీని అధిగమించాడు. ప్రస్తుతం పంత్ ఖాతాలో 745 పాయింట్లు ఉన్నాయి. కోహ్లీ ఖాతాలో ప్రస్తుతం 720 పాయింట్లు ఉన్నాయి. బుధవారం విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్ లో భారత్ నుంచి ముగ్గురు ప్లేయర్లకి టాప్ టెన్ లో చోటు దక్కింది. ఇక భారత్ నుంచి యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ టాప్ 4 లో నిలిచాడు. ఇక ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ ఈ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

ప్రస్తుతం టాప్ టెన్ లో ముగ్గురు భారత ప్లేయర్లు ఉండడం విశేషం. ఇక భారత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా బెంగళూరు టెస్ట్ లో అర్థ శతకం సాధించినప్పటికీ రెండు స్థానాలు నష్టపోయి 16వ స్థానానికి పడిపోయాడు. ప్రస్తుతం రోహిత్ ఖాతాలో 683 పాయింట్లు ఉన్నాయి. ఇక శుభమన్ గిల్ తొలి టెస్ట్ కి దూరం కాగా.. అతను నాలుగు స్థానాలు కోల్పోయి 20వ స్థానానికి జారిపోయాడు. ఓవరాల్ గా భారత్ తరపున టాప్ 20 లో నిలిచిన ప్లేయర్లు ఈ ఐదుగురు మాత్రమే.

Read more RELATED
Recommended to you

Latest news