ఒంగోలు బస్టాండులో మహిళపై దాడి.. వీడియో వైరల్

-

ఒంగోలు బస్టాండ్ లో దారుణం చోటు చేసుకుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత…. మహిళలపై రోజురోజుకు దారుణాలు జరుగుతున్నాయి. అయితే తాజాగా ఒంగోలు బస్టాండ్ లో ఓ మహిళను కర్రతో దారుణంగా ఓ వ్యక్తి… కారణంగా కొట్టడం జరిగింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ లో… నిన్న రాత్రి బస్సు కోసం ఓ మహిళ వెయిట్ చేస్తోంది. అయితే ఉన్నఫలంగా… అక్కడికి ఓ అజ్ఞాత వ్యక్తి వచ్చి… ఆ మహిళపై దాడి చేశాడు. జుట్టు పట్టి లాగి పడేశాడు. ఓ కర్ర పట్టుకుని చితకబాదాడు. దుర్భాషలాడుతూ… ఆ మహిళను దారుణంగా కొట్టాడు ఆ వ్యక్తి. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సంఘటనపై పోలీసులు ఇంకా స్పందించలేదు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

 

Read more RELATED
Recommended to you

Latest news