ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించనుంది చంద్రబాబు కూటమి ప్రభుత్వం. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డును 26 వేల కోట్లతో… నిర్మించేందుకు చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఏకంగా 189 కిలోమీటర్ల మేర… అమరావతి ఔటర్ రింగ్ రోడ్డును నిర్మించేందుకు కసరత్తులు చేస్తోంది.
నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబుతో… ఎన్ హెచ్ ఏ ఐ అధికారుల భేటీలో…. ఔటర్ రింగ్ రోడ్డు తో పాటు కుప్పం, హోసూర్ బెంగళూరు రోడ్డును… నిర్మించడంపై కూడా చర్చలు జరిగాయి. దీని కోసం 300 కోట్లు ఖర్చు కాబోతుందట. 56 కిలోమీటర్ల మేర ఈ రోడ్డున నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారట.