An airport will soon be constructed at Mamunur in Warangal district: వరంగల్ ప్రజలకు అదిరిపోయే శుభవార్త అందింది. వరంగల్ లో ఎయిర్ పోర్టుకు లైన్ క్లియర్ అయిందని వార్తలు వస్తున్నాయి. వరంగల్ జిల్లాలోని మామునూరులో త్వరలో ఎయిర్పోర్టు నిర్మాణం చేపట్టబోతున్నారట. ‘150 కిలోమీటర్ల’ నిబంధనను పక్కనపెట్టటానికి ఒప్పుకుందట GMR సంస్థ. GMR ఆధ్వర్యంలో ఉన్న శంషాబాద్ విమానాశ్రయానికి 150 కి.మీ.ల పరిధిలో 2038 వరకూ కమర్శియల్ విమానాశ్రయాలను ఏర్పాటు చేయవద్దు.
అయితే తాజాగా ఈ నిబంధనను పక్కన పెట్టేందుకు GMR సంస్థ ఒప్పుకుందని సమాచారం అందుతోంది. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. అయితే.. వరంగల్ లో ఎయిర్ పోర్టుకు లైన్ క్లియర్ అయిందని వార్తలు వస్తున్న తరునంలోనే.. అక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కేంద్రం ముందుకు వచ్చి.. పనులు చేయాలని కోరుతున్నారు.