అమెరికాలో ఎలక్ట్రికల్ వెహికల్‌ను ఆవిష్కరించారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్. ఫాల్కన్ ఎక్స్ అనుబంధ సంస్థ బోసన్ మోటార్స్ రూపొందించిన ఇంటిలిజెంట్ ఎలక్ట్రికల్ లైట్ యుటిలిటీ వెహికల్ డ్రైవర్ లెస్ క్యాబిన్ ట్రక్ ను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్… శాన్ జోస్ మేయర్ మట్ మహన్, మిల్పిటాస్ మేయర్ కార్మెన్ మోంటనోలతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… చంద్రబాబు నేతృత్వాన ఎపిలో పరిశ్రమలస్థాపనకు మెరుగైన ఎకోసిస్టమ్ కల్పించామన్నారు. సరైన ప్రతిపాదనలతో వస్తే వెనువెంటనే అనుమతులు, ప్రోత్సాహకాలు అని తెలిపారు.