ఉపాధి హామీ పనుల నాణ్యతలో రాజీ వద్దు : డిప్యూటీసీఎం పవన్ కళ్యాణ్

-

ఉపాధి హామీ పనుల్లో నాణ్యత విషయంలో రాజీ పడొద్దని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆదివారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ కృష్ణ తేజ, ఉపాధి హామీ పథకం అధికారులు, ఇంజినీరింగ్ అధికారులతో పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ప్రతి దశలోనూ నాణ్యతా ప్రమాణాలను తనిఖీ చేయాలన్నారు.కేంద్ర ప్రభుత్వం నుంచి ఉపాధి హామీతోపాటు 15వ ఆర్థిక సంఘం నుంచి నిధులు వచ్చాయని, వాటిని సక్రమంగా, పారదర్శకంగా సద్వినియోగం చేయాలని కోరారు.

AP Deputy CM Pawan Kalyan Palle Panduga

రాష్ట్రవ్యాప్తంగా 13,326 పంచాయతీల్లో అభివృద్ధి పనుల నాణ్యతను అధికారులు తనిఖీ చేయాలని ఆదేశించారు. 2024 -25 ఏడాదిలో సిమెంట్ రోడ్లు 3,000 కి.మీ, బీటీ రోడ్లు 500కి.మీ, గోకులాలు 22,525, ఫారం పాండ్లు 25,000, 30వేల ఎకరాలకు సంబంధించి నీటి సంరక్షణ కందకాలు, వాటి పనులు పల్లె పండుగ నుంచి మొదలు
ఉపాధి హామీ, ఆర్థిక సంఘం నిధుల ద్వారా చేపట్టే పనులను నిర్దేశిత ప్రమాణాల ప్రకారం చేయాలన్నారు. పంచాయతీల నిధులు గతంలో మాదిరి పక్కదారి పట్టడం లేదని ప్రజలకు తెలియజేయాలన్నారు. సిటిజన్ ఇన్ఫర్మేషన్ బోర్డుల ద్వారా కూడా ఏ పంచాయతీకి ఎంత నిధులు అందాయో, వాటి ద్వారా చేస్తున్న పనులు ఏమిటో కూడా ప్రజలకు వివరించాల్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి గ్రామ సభల నిర్వహణ, పల్లె పండుగ కార్యక్రమాల ద్వారా పనుల ప్రారంభం జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news