అక్కడి నుంచే రాజకీయ వ్యూహాలు రచిస్తున్న గులాబీ బాస్.. ఆయన ఎంట్రీకి రంగం సిద్దం..

-

ప్రత్యర్దులపై నిత్యం విమర్శలు, సెటైర్లు సంధించే నేతలు..మీడియా ముందుకు రాకుండా.. సైలెంట్ అయితే అది రాజకీ౩య వ్యూహంలో భాగంగానే ఉంటుంది.. పార్టీ క్యాడర్ క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తుంటే.. అధినేత మాత్రం పోరాటాలను చూస్తున్నారు తప్ప మాట్లాడటంలేదు.. మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో మీకు క్లారిటీ వచ్చేసే ఉంటుంది.. తెరవెనుకుండి గులాబీ బాస్ పార్టీని నడిపిస్తున్నారు..

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో కేసీయార్ రాజకీయాలకు టచ్ మీ నాట్ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.. అడపాదడపా బయటికి వస్తున్నా.. పెద్దగా విమర్శలు చెయ్యడంలేదు.. ఫామ్ హౌస్ లో ఉంటూనే.. రాజకీయాలను నడుపుతున్నారు.. అక్కడి నుంచే వ్యూహాలు రచిస్తూ.. క్యాడర్ కు దిశానిర్దేశం చేస్తున్నారు.. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి హరీష్‌రావులను వార్ జోన్ లో పెట్టి.. వారి చేత యుద్దం చేయిస్తున్నారు..

ఫామ్ హౌస్ నుంచి కేసీయార్ పాచికలు వేస్తుంటే.. బీఆర్ఎస్ కీలక నేతలు వాటిని అమలు చేస్తున్నారు.. కేసీఆర్ మౌనంగా ఉంటూ.. వారి చేత పొలిటికల్ వార్ నడిపిస్తున్నారు.. రైతు రుణమాఫీ పూర్తిస్ధాయిలో కాలేదని బీఆర్ఎస్సే ఆరోపిస్తోంది. నాలుగు వేల పెన్షన్ అమలులోకి రాలేదు. హైడ్రా, మూసీ గొడవ అయితే రెగ్యులర్ అయిపోయింది. మరి ఇన్ని ఇష్యూస్ ఉన్నా కేసీఆర్ రియాక్ట్ కాకపోవడానికి కారణం ఏంటనే ప్రశ్న అధికార కాంగ్రెస్ తోపాటు.. బీఆర్ఎస్ క్యాడర్ లో కూడా ఉంది..

మీడియా ముందు కనిపించకపోయినా ఫాంహౌస్ నుంచే పార్టీ నేతల ద్వారానే రాజకీయాలను నడిపిస్తున్నారు కేసీఆర్. సీఎం రేవంత్ రెడ్డి సహా నేతలంతా కేసీఆర్ టార్గెట్గా రెచ్చగొట్టేలా విమర్శలు చేస్తున్నా కాంగ్రెస్ నేతల ట్రాప్ లో ఆయన పడటంలేదు.. డిసెంబర్ ఏడు తర్వాత దేఖో మై హీరోయిజం అన్నట్లుగా కేసీయార్ బయటికి వస్తారని బీఆర్ఎస్ సీనియర్ నేతలు చెబుతున్నారు.. ఆయన వ్యూహాలతో నేతలద్వారా పోరాటం చేయిస్తూనే.. పార్టీ నిర్మాణంపై కేసీఆర్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.. కాంగ్రెస్ పాలన ఏడాది ముగిసిన తర్వాత భారీ బహిరంగ సభ పెట్టి..వారి వైఫల్యాలను ప్రజలకు తెలియజెయ్యాలని గులాబీ బాస్ ఆలోచిస్తున్నారట..

Read more RELATED
Recommended to you

Latest news