కడుపు నిండా తినడం ఆరోగ్యానికి మంచిది. కడుపు నిండినా తింటే లేనిపోని అసౌకర్యం..పొట్ట ఫ్రీ అయ్యేవరకు ఉక్కిరిబిక్కిరి అవ్వాల్సిందే. ఏదైనా అతి చేస్తే అది చివరకకు మనకే చేటు చేస్తుంది. ఎందులో అయినా సరే..! మన శరీరానికి విటమిన్ డీ చాలా అవసరం. డీ విటమిన్ లోపిస్తే ఏం జరగుతుందో ఇప్పటికే చాలా సార్లు చెప్పుకున్నాం..లోపం ఉంది కదా అని అధిక మోతాదులో తీసుకుంటే..డీ విటమిన్ ఎక్కువైనా కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి. లెక్క ఎక్కువైనా, తక్కువైనా సమస్యేనండోయ్..!
సప్లిమెంట్ల రూపంలో విటమిన్ డి ఎక్కువగా తీసుకోకూడదు. అలా తీసుకుంటే.. వికారం, వాంతులు సమస్య మొదలవుతుంది. డాక్టర్, నిపుణుడి సలహా ప్రకారమే తీసుకోవాలి.
విటమిన్ డి పరిమితికి మించి తీసుకుంటే..మానసిక వ్యాధులను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది.
విటమిన్ డి తీసుకోవడంలో తప్పుడు పద్ధతులు అవలంభించడం వలన ఆకలి తగ్గిపోతుందట.. మరీ అవసరమైతే తప్ప సప్లిమెంట్స్ తీసుకోకూడదని వైద్యులు అంటున్నారు.వాటికి బదులుగా సూర్యకాంతి ద్వారా విటమిన్ డి లోపాన్ని అధిగమించవచ్చు. ఉదయం వేళ కాసేపు ఎండలో నడవడం, కూర్చుకోవడం లాంటివి చేస్తే.. ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు.
విటమిన్ డి కోసం తయారు చేయబడిన సప్లిమెంట్లు, దాని మూలాలను కలిగి ఉన్న ఆహారాలను అధికంగా తీసుకోవడం వలన మలబద్ధకం సమస్య ఏర్పడుతుంది.
సో ఇలా ఉంటుంది. విటమిన్ డీ విషయంలోనే కాదు.. ఇతర విటమిన్లు కూడా అంతే. లోపం ఉందని తెలిస్తే..తగిన మోతాదులో క్రమంగా మాత్రమే తగిన ఆహారాలు, టాబ్లెట్స్ వాడాల్సి ఉంటుంది. సమస్య ఉంది కదా అని అదేపనిగా వాడితే.. అనవసరమైన చిక్కుల్లో పడాల్సిందే..! విటమిన్ డి అనేది ఎముకలను ఆరోగ్యకరంగా ఉంచుతూ, కాల్షియం స్థాయిలను నియంత్రణలో ఉంచే ఒక ముఖ్యమైన ప్రోహార్మోన్. ఈ విటమిన్ కొన్ని ఆటో ఇమ్యూన్ వ్యాధులు, మెటబాలిక్ సిండ్రోమ్ ముప్పు తగ్గించడంలోనూ కీలకపాత్ర పోషిస్తుంది. ఇది ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే రిస్క్ కూడా ఉందని వైద్యులు అంటున్నారు.
గమనిక: ఈ సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది, కేవలం అవగాహన కోసం మాత్రమే. “మనలోకం” ధృవీకరించడలేదు. పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.